![]() |

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh), సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar) కాంబినేషన్‌లో జియో స్టూడియోస్ నిర్మించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ "ధురంధర్: ది రివెంజ్" బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. (Dhurandhar The Revenge)
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, మొదటి ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది.
జియో స్టూడియోస్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.814 కోట్లు, ఓవర్సీస్ లో రూ.274 కోట్లతో.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1088 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ ఘనతతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా "ధురంధర్-2" నిలిచింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
కేవలం హిందీలోనే కాకుండా, సౌత్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు వెర్షన్ ద్వారా దాదాపు ₹20 కోట్ల నెట్ కలెక్షన్స్ రావడం విశేషం. రణవీర్ సింగ్ యాక్షన్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే గూఢచారి కథాంశం కావడంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ప్రస్తుత ఊపు చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫుల్ రన్ లో 'పుష్ప-2', 'బాహుబలి-2' స్థాయి వసూళ్ళు రాబట్టిన ఆశ్చర్యంలేదు.
![]() |